ఆర్యవైశ్యులు నాయకత్వ స్థాయికి ఎదగటం సంతోషం | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులు నాయకత్వ స్థాయికి ఎదగటం సంతోషం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

ఆర్యవైశ్యులు నాయకత్వ స్థాయికి ఎదగటం సంతోషం వీఆర్వోల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కసుకుర్తి ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్‌ టీజీ వెంకటేష్‌

తెనాలి: సమాజంలో నాయకత్వం వహించే స్థాయికి ఆర్యవైశ్యులు ఎదగటం చాలా సంతోషంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్‌ టీజీ వెంకటేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం పదవీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం సాయంత్రం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించారు. సభకు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఒకప్పుడు ఆర్యవైశ్య కులం అంటే చులకనగాను చిన్నచూపు చూసేవాళ్లనీ, ఎగతాళి చేస్తూ పిలవటం, మాట్లాడటం చేసేవారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సమాజంలో ఆర్యవైశ్యులు వివిధ రంగాల్లో ఉన్నతంగా ఎదగటం మంచి పరిణామమని చెప్పారు. అంతేకాకుండా సేవాకార్యక్రమాల్లోనూ ఆర్యవైశ్యులు ముందుండటం గొప్ప విషయమన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అన్యాయానికి పాల్పడకుండా ధర్మంగా ఒక స్థాయిని కలిగి ఉండే విధంగా ఆర్యవైశ్యులు వ్యవహరించాలని వెంకటేష్‌ సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహించాలని కోరారు. రాజకీయంగానూ ఆర్యవైశ్యుల మరింతగా ఎదగాలని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు కౌన్సిలర్లు, చైర్మన్లుగా చేసిన నాయకుల్లో కొందరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండటం సమంజసం కాదన్నారు. తాను, తన కుమారుడు, రాష్ట్రమంత్రి టీజీ భరత్‌గుప్త మీకు అన్నివిధాల సహకరించేలా అందుబాటులో ఉంటామని చెప్పారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థలు సభ్యులతో ప్రమాణం చేయించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చుండూరు ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కొత్తా రామారావు, కోశాధికారిగా డోగిపర్తి శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సంకా లక్ష్మీనరసింహమూర్తి, ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): ఏపీ వీఆర్వోల అసోసియేషన్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా కసుకుర్తి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్‌లో ఏపీ వీఆర్వోల అసోసియేషన్‌ గుంటూరు జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన అధ్యక్షుడిగా కసుకుర్తి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీనివాసరావును అసోసియేషన్‌ నాయకులు, వీఆర్వోలు అభినందించారు. కసుకుర్తి మాట్లాడుతూ జిల్లాలోని వీఆర్వోలు అందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి, క్షేత్రస్థాయిలో వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావును ఏపీ ఆర్‌ఎస్‌ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ వీఆర్వోల సమైక్యతను చాటాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీ వీఆర్వో అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర రామారావు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ ఆయూబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగేశ్వరరావు, వీరయ్య, వెంకటేశ్వర్లు, జాయింట్‌ సెక్రటరీలు శ్రీనివాసరావు, బోసు బాబు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement