నూకల వేణుగోపాలరావుకు కన్నీటి వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

నూకల వేణుగోపాలరావుకు కన్నీటి వీడ్కోలు

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాదాత, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు నూకల వెంకట వేణుగోపాలరావుకు ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. నిరాడండరంగా జీవిస్తూ ఎందరికో ఉపాధిని, విద్యనూ అందిస్తూ, శ్రీవాసవీ దేవస్థానాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపురేఖలు దిద్దిన నూకల వెంకట వేణుగోపాలరావుకు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన అంతిమయాత్రను ఘనంగా జరిపారు. బుర్రిపాలెంరోడ్డు చివరలోని సొంత స్థలంలో అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా పూర్తిచేశారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, వేణుగోపాలరావుకు నివాళి అర్పించటమే కాకుండా, అంతిమయాత్రలోనూ పాల్గొన్నారు. తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారి కాంతిలాల్‌ దండే, తమిళనాడు మాజీ గవర్నర్‌ దివంగత కొణిజేటి రోశయ్య కుమారుడు కొణిజేటి శివ, డబుల్‌ హార్స్‌ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్‌శ్యాంప్రసాద్‌, కుమార్‌ పంప్స్‌ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ప్రముఖ వ్యాపారవేత్త నంబూరు వెంకట కృష్ణమూర్తి, శశి గ్రూప్స్‌ అధినేత వుప్పల వరదరాజులు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మాలేపాటి హరిప్రసాద్‌, హెల్త్‌ హాస్పిటల్స్‌ అధినేతలు డాక్టర్‌ నన్నపనేని ప్రతాప్‌, మన్నే హరీష్‌, ఆర్యవైశ్య ప్రముఖులు మద్దాళి శేషాచలం, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయిహరేరామ్‌, వక్కలగడ్డ గంగాధరరావు, కొణిజేటి గోపీకృష్ణ, శ్రీవాసవీ దేవస్థానం కమిటీ సభ్యులు, ఎన్‌ఆర్‌కే టెక్స్‌టైల్స్‌ ఉద్యోగులు పలువురు నివాళి అర్పించినవారిలో ఉన్నారు.

తరలివచ్చిన ప్రజాప్రతినిధులు,

వివిధ రంగాల ప్రముఖులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement