ఎమ్మెల్సీ ఓటు నమోదు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటు నమోదు కేంద్రం ప్రారంభం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు– కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లుగా అర్హులైన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఓటు నమోదుకు సోమవారం నుంచి నవంబర్‌ ఆరో తేదీ వరకు వరకు అవకాశం ఉందని, గడువు ముగిసే వరకు ఉండకుండా ముందుగా నమోదు చేసుకోవాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్‌ మాట్లాడుతూ ఓటు నమోదు కోసం యూటీఎఫ్‌ మండల, పట్టణ నాయకులతో పాటు జిల్లా కార్యాలయంలో సంప్రదించవచ్చునని తెలిపారు. బ్రాడీపేటలోని జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వివరాలకు 70363 59015, 77024 92777 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు సీహెచ్‌ ఆదినారాయణ, ఎం.గోవింద్‌, కోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు నరసింహారావు, ప్రసాద్‌, ఆదాం సాహెబ్‌, రమేష్‌, రత్నకుమార్‌, పాణిరెడ్డి, అనంతలక్ష్మి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement