న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
వినాయక చవితిని జిల్లాలోని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. సోమవారం భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ఇంటింటా కొలిచారు. ఆనందంగా వేడుకలను జరుపుకొన్నారు. ఊరూవాడా మండపాలు ఏర్పాటు చేసి వైవిధ్య రూపాల్లో గణపయ్యను కొలువుదీర్చారు. పూజలు, భజనలు, నైవేద్యాలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ భక్తులు ‘‘జై గణేశా.. జై జై గణేశా’’ అంటూ ఎంతో ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు


