మేధకు వెన్నుదన్ను | - | Sakshi
Sakshi News home page

మేధకు వెన్నుదన్ను

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

మేధకు వెన్నుదన్ను

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇన్‌స్పైర్‌ మానక్‌ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రతి విద్యార్థికి రూ.10 వేలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అవకాశం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రాజెక్టుల ఎంపికకు విద్యాశాఖఆదేశాలు ఈనెల 15 వరకు ప్రాజెక్టు నివేదికలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు గడువు

ఇన్‌స్పైర్‌ మనక్‌ రిజిస్ట్రేషన్లకు ఈనెల 15 వరకు గడువు

విద్యార్థులతో రిజిస్ట్రేషన్‌ చేయించాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రస్తుతం తరం విన్నూత ఆలోచనలతో ముందుకెళ్తోంది. సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. పరిష్కారానికి సులవైన మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పైర్‌ చేసే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోంది. చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్‌స్పైర్‌ మానక్‌ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహిస్తు న్న కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో వా టికి బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతో పాటు సైన్స్‌ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్‌స్పైర్‌ మానక్‌ రిజస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) ఆన్‌లైన్‌లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రాజెక్టు నివేదికలను నమోదు చేసుకునేందుకు తుది గడువు ఈనెల 15న ముగియనుంది.

ప్రాజెక్టుల తయారీ కోసం..

విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాలస్థాయిలో మూడు చొప్పున ప్రాజెక్టులను విద్యార్థులతో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేయించాల్సి ఉంది. అందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకుని వారి పాఠశాలల్లో విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించేందుకు సైన్స్‌ ఉపాధ్యాయులకు బాధ్యత అప్పగించాల్సి ఉంది.

గతేడాది 1,100 ప్రాజెక్టులు నమోదు

గతేడాది ఇన్‌స్పైర్‌ మానక్‌ వైజ్ఞానిక ప్రదర్శనలకు గుంటూరు జిల్లా నుంచి నమోదు చేసిన 1,100 ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 88 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సంబంధిత ప్రాజెక్టుల తయారీకి ఒక్కో విద్యార్థికీ రూ.10 వేలు చొప్పున మంజూరు చేసింది. గతంలో నిర్వహించిన ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రదర్శనల్లో భాగంగా పలువురు విద్యార్థులు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ చాటి కేంద్ర మంత్రుల చేతుల మీదుగా అవార్డులు పొందిన విద్యార్థులు ఉన్నారు.

నమోదు ఎలా అంటే..

విద్యార్థులు ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌– డీఎస్‌టీ.జీవోవీ.ఇన్‌ సైట్‌కు లాగిన్‌ అయ్యి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది. విద్యార్థి పేరు, పాఠశాల, చదువుతున్న తరగతి వివరాలతో పాటు విద్యార్ధి ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా, పేరెంట్‌ జాయింట్‌ అకౌంట్‌ నంబ ర్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాలు న మోదు చేయాలి. పూర్తి వివరాలను హెచ్‌ఎం, సైన్స్‌ టీచర్ల నుంచి పొందాలి. విద్యార్థులు పంపిన ప్రాజెక్టులను పరిశీలించిన తరువాత వాటిలో బెస్ట్‌ ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసి, ప్రదర్శన జరిగే సమయంలో వాటిని తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులను కలుపుకుని సంబంధిత విద్యార్థికి రూ.10 వేలు చొప్పున కేంద్ర అందించనుంది.

సమస్యలకు పరిష్కారానికి వినూత్న ఆలోచనలు

ఇన్‌స్పైర్‌ మానక్‌ ప్రదర్శనకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు తుది గడువు ఈనెల 15న ముగియనుంది. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, రెసిడెన్షియల్‌, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి, ప్రజలకు మేలు చేసే అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్‌ టీచర్‌ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంది. వైజ్ఞానిక ప్రతిభ, నూతన ఆలోచనలు కలిగిన విద్యార్థులకు ఆకాశమే హద్దుగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనల ద్వారా ప్రతిభ చాటేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో మూడు ప్రాజెక్టులు, హైస్కూల్‌, ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ఐదు ప్రాజెక్టుల చొప్పున నమోదు చేసుకోవాలి.

ఇన్‌స్పైర్‌ మానక్‌ ప్రదర్శనపై అన్ని యూపీ, హైస్కూల్స్‌, హైస్కూల్‌ ప్లస్‌ యాజమాన్యాలు విద్యార్థులకు సమాచారం ఇచ్చి, ఆసక్తి గల విద్యార్థులను కచ్చితంగా ప్రోత్సహించాలి. తరగతి గదిలో చదువుతో పాటు విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి పరచడంలో ఇన్‌స్పైర్‌ ప్రోగ్రామ్‌ ఎంతో కీలకం. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోని పాఠశాలలు, కళాశాలలు తక్షణమే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహించాలి. –షేక్‌ సలీమ్‌ బాషా, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement