ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్జేడీ కార్యాలయం ఎదుట నిరసన ఇంటర్మీడియట్ ఆర్‌ఐఓ సునీత, ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డిలకు వినతిపత్రాలు అందజేత
లక్ష్మీపురం: ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గుంటూరు నాజ్ సెంటర్‌లోని ఆర్జేడీ కార్యాలయం వద్ద ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌ఐఓ సునీత, ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే నోటీసులు ఇచ్చి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించకుండా చూస్తామని ఆర్‌ఐఓ, ఆర్జేడీ హామీచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సతీష్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.


