ఐదు రోజుల పనివిధానం అమలు చేయాలంటూ యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో నేడు బంద్ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వినతి స్పందించకుంటే 28 నుంచి మళ్లీ సమ్మె అప్పటికీ ఫలితం లేకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక ఆందోళన
కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. యూఎఫ్‌బీయూ పరిధిలోని ఏడు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. గుంటూరు నగరం, జీటీ రోడ్‌లో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ బ్యాంకుల యూనియన్ల నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌న్ (ఐబీఏ)తో చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌పీఎస్‌కు బదులుగా పాత పెన్షన్‌న్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మె, అనంతరం అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల నాయకులు కె.రవికుమార్, కేఆర్‌వీ విజయ్‌కుమార్, నాగపావని, కె.కోటిరెడ్డి, రాంబాబు, మైనేని శివప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వి.రాధాకృష్ణమూర్తి, సీఐటీయూ నాయకులు లక్ష్మీనారాయణ, నళినీకాంత్, ఎం.సాంబశివరావు, జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


