తాడేపల్లి రూరల్: ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తాడేపల్లి పట్టణ పరిధిలోని విద్యాశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట గురువారం ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు నిర్బంధించి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, యువజన సంఘం నాయకులు డి.వి. భాస్కర్ రెడ్డి, యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, పల్నాడు, కోనసీమ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్, హరీష్, కాకినాడ జిల్లా సహాయ అధ్యక్షులు నాగమణి, కడప జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరి ప్రసాద్, ఆంజనేయులు, శ్రీనివాసరావు, రమేష్ పాల్గొన్నారు.


