డాక్టర్‌ రాఘవరెడ్డికి అవుట్‌లుక్‌ ఇండియా అవార్డు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రాఘవరెడ్డికి అవుట్‌లుక్‌ ఇండియా అవార్డు

Aug 28 2026 2:27 AM | Updated on Aug 28 2026 2:27 AM

డాక్టర్‌ రాఘవరెడ్డికి అవుట్‌లుక్‌ ఇండియా అవార్డు గుంటూరు మెడికల్‌: గుంటూరుకు చెందిన క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, ఆర్క హాస్పటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ రాఘవరెడ్డి కల్లూరి ఉత్తమ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు అవార్డుకు ఎంపికయ్యారు. అవుట్‌ లుక్‌ ఇండియా – 2026 ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉత్తమ మెడికల్‌ ఆంకాలజిస్టుగా డాక్టర్‌ పవన్‌ రాఘవరెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. క్యాన్సర్‌ చికిత్సలో ఆయన చూపుతున్న నైపుణ్యం, రోగులపై చూపిస్తున్న కరుణ, ప్రతి క్యాన్సర్‌ రోగిలో జీవితంపై ఆశను కల్పించడం వంటి అంశాలపై ఈ అవార్డును డాక్టర్‌ పవన్‌ రాఘవరెడ్డికి అందజేశారు. అవార్డుకు ఎంపికై న డాక్టర్‌ పవన్‌ రాఘవరెడ్డికి గుజ్జనగుండ్ల వాకింగ్‌ ట్రాక్‌ సభ్యులు, పలువురు క్యాన్సర్‌ వైద్యులు, ఐఎంఏ వైద్య నిపుణులు అభినందనలు తెలిపారు. కొండవాగులో గుర్తు తెలియని మృతదేహం ప్రత్తిపాడు: కొండవాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడు మండలం నడింపాలెం పంచాయతీ పరిధిలోని కొండవాగులో సుమారు 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎన్‌.నరహరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ నరహరితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాన్ని, చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. అయితే దేహం నుంచి ఎముకలు బయటపడి, కొంత భాగం కుళ్లి పోయి ఉండటంతో మృతుడు చనిపోయి సుమారు పదిహేను రోజుల పైనే అయ్యి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు గులాబీ రంగు ఫుల్‌ హ్యాండ్‌ టీ షర్టు, నీలం రంగు జీన్స్‌ ఫ్యాంటు ధరించి ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు 8688831386, 9154876312 నంబర్లును సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. ఇన్‌ సర్వీసు టెట్‌లో లోపాలు సవరించాలి ఓపెన్‌ డ్రింకింగ్‌పై ప్రత్యేక తనిఖీలు సంస్కృతాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం

ఎస్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయుల నిరసన

గుంటూరు ఎడ్యుకేషన్‌:ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన టెట్‌ నోటిఫికేషన్‌లో నెలకొన్న లోపాలను సవరించాలని అఖిల భారత సెకండరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్టీఎఫ్‌) జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయుల కోసం విడుదల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ నిబంధనలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎస్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ టెట్‌ పరీక్షకు అర్హత సాధించాలనే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయులకు అనుకూలంగా ఎటువంటి మినహాయింపులు లేవన్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు ఆందోళన చెంతున్నారని చెప్పారు. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు డి.పెదబాబు, సంఘ జిల్లా అధ్యక్షుడు షేక్‌ బాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యామ్‌బాబు, రాష్ట్ర నాయకుడు శ్రీధర్‌ మాట్లాడారు. ఎస్టీయూ సీనియర్‌ నాయకుడు ఎస్‌.రామ చంద్రయ్య, జిల్లా ఆర్థిక కార్యదర్శి హనుమంత ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే (ఓపెన్‌ డ్రింకింగ్‌) వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో తనిఖీలు కొనసాగించారు. పలువురిపై 72 కేసులు నమోదుచేశారు. ముఖ్యమైన కూడళ్లు, మద్యం దుకాణాల సమీప ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు, పార్కులు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల పరిసరాలు, నిర్మానుష్య రహదారులపై విసృతంగా పరిశీలించారు. బహిరంగంగా మద్యం సేవించడం నేరమని మందుబాబులకు పోలీస్‌ అధికారులు కౌన్సెలింగ్‌ చేశారు. బహిరంగంగా మద్యం తాగి, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ శరత్‌ చంద్ర

గుంటూరు ఎడ్యుకేషన్‌:జాతీయ వాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ శరత్‌ చంద్ర అన్నారు. ఐదు వందల గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బ్రాడీపేటలోని శ్రీ శారదానికేతన్‌ ఓరియంటల్‌ కళాశాలలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ సౌజన్యంతో తెలుగు, సంస్కృత అకాడమీ సంస్కృత సప్తాహం వారోత్సవాలు నిర్వహించారు. విల్సన్‌ శరత్‌చంద్ర మాట్లాడుతూ సామాన్యులకు సంస్కృత భాష చేర్చే కార్యాచరణ అకాడమీ చేపడుతుందని పేర్కొన్నారు. ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌ ఆచార్య పి.వరప్రసాద మూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, డాక్టర్‌ దీవి నరసింహ దీక్షిత్‌, సంస్కృత పండితుడు డాక్టర్‌ రంగాచార్య మాట్లాడారు. సంస్కృ పడితుడు డాక్టర్‌ శ్రిష్టి లక్ష్మీ కుమార శర్మ, డాక్టర్‌ ఆకెళ్ళ మల్లు సోమయాజులు, సుఖవాసి మల్లికార్జునరాయ శాస్త్రి, కూనిశెట్టి స్వరాజ్య లక్ష్మిని సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement