కాంచీపురం పెరుమాళ్‌ సిల్క్స్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కాంచీపురం పెరుమాళ్‌ సిల్క్స్‌ ప్రారంభం

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

కాంచీపురం పెరుమాళ్‌ సిల్క్స్‌ ప్రారంభం ప్రజల గొంతుకగా పనిచేస్తా మేధోశక్తిని పెంపొందించేందుకే చెకుముకి పోటీలు మెడికల్‌ కాలేజీ భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి

నగరంపాలెం: నగరంలోని లక్ష్మీపురం మూడో లైన్‌న్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంచీపురం పెరుమాళ్‌ సిల్క్స్‌ వస్త్ర దుకాణాన్ని బుధవారం పరిపూర్ణానంద స్వామీజీ ప్రారంభించారు. సినిమా నటి కుమారి ఐశ్వర్య రాజేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంచీపురం పెరుమాళ్‌ సిల్క్స్‌ యజమానులు బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్‌ మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు అత్యుత్తమైన, నాణ్యతతో కూడిన పట్టు వస్త్రాలు, సంప్రదాయ చీరలు, ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్ర కలెక్షన్‌ను అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వినియోగదారుడికి నాణ్యత, విశ్వసనీయత, ప్రత్యేకమైన షాపింగ్‌ అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులోనూ గుంటూరు ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలు అందించాలని కోరారు. ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్‌అహ్మద్‌, మాజీ మేయర్‌ కోవెలమూడి రవీంద్ర(నాని) పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: శాసనమండలిలో ప్రజా గొంతుకగా పనిచేస్తూ ప్రజల పక్షాన, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతానని గుంటూరు – కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు స్పష్టం చేసారు. పీడీఎఫ్‌ ప్రతినిధిగా ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హనుమంతరావు పరిచయ కార్యక్రమాన్ని బుధవారం ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న హనుమంతరావును గెలిపించుకోవటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు, ఏ. నాగేశ్వరరావు, కుసుమకుమారి పాల్గొన్నారు.

బాపట్లటౌన్‌: విద్యార్థుల్లో దాగివున్న మేథోశక్తిని పెంపొందించేందుకే చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మండలంలోని వెదుళ్లపల్లి చైతన్యభవన్‌లో బుధవారం చెకుముకి పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మొదటిదశ ఈనెల 27న జరుగుతున్నాయన్నారు. రెండో దశ సెప్టెంబర్‌ 11 జిల్లా స్థాయిలో, మూడో దశ పోటీలు నవంబర్‌ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరుగుతాయన్నారు. నేటి ఆధునిక సమాజంలో మానవుల జీవితమంతా సైన్సు ఆధారంగానే నడుస్తుందన్నారు. అయితే చాలా విషయాల్లో సైన్స్‌కు భిన్నంగా ప్రజల ఆలోచన విధానం వెనకబడి ఉందన్నారు. జనవిజ్ఞాన వేదిక గత నాలుగు దశాబ్దాలుగా రకరకాల విభిన్నమైన కార్యక్రమాలతో ప్రజల్లో శాసీ్త్రయ ఆలోచన పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు చిన్ననాటి నుండి శాసీ్త్రయ ఆలోచన పెంపొందించుటకు గత 38 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 లక్షల మంది హైస్కూల్‌ స్థాయి 8, 9,10 తరగతుల్లోని విద్యార్థులకు ఈ చెకుముకి సైనన్స్‌ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, జిల్లా జన విజ్ఞాన వేదిక నాయకులు కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

పిడుగురాళ్ల: మెడికల్‌ కాలేజీ భవనంపై నుంచి కింద పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం పిడుగురాళ్ల మెడికల్‌ కళాశాల నూతన భవనం వద్ద జరిగింది. సంఘటనకు సబంధించి ఎస్‌ఐ ఎం.మోహన్‌ తెలిపిన వివరాల మేరకు... బీహార్‌ రాష్ట్రానికి చెందిన రమాకాంత్‌ భష్వాన్‌ (35) రోజు మాదిరిగానే భవన నిర్మాణ పనులలో పాల్గొని మంగళవారం రాత్రి నూతనంగా నిర్మిస్తున్న ఐదంతస్తుల మెడికల్‌ కళాశాల భవనంపై నిద్రించాడు బుధవారం తెల్లవారుజామున నిద్ర లేస్తూ కాలుజారి ఐదో అంతస్తు నుంచి క్రింద పడ్డాడు. సంఘటనా స్థలంలోనే అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నట్లు తెలిపారు. తోటి కార్మికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement