సెల్‌ఫోన్ లైట్లతో నిరసన తెలిపిన జూడాలు శుక్రవారానికి 12వ రోజుకు చేరిన జూడాల సమ్మె
గుంటూరు మెడికల్: జూనియర్ డాక్టర్లకు మూడు శాతం స్టయిఫండ్ ఇస్తామన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ తమకు మూడు శాతం వద్దని, మొదటి నుంచి తాము అడుగుతున్న 30 శాతం ఇవ్వాలంటూ గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు సెల్‌ఫోన్ లెట్ల వెలుగులో శుక్రవారం రాత్రి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె శుక్రవారానికి 12వ రోజుకు చేరుకుంది. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట జూడాలు బైఠాయించి తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. కొంత మంది జూనియర్ డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు చేశారు. రాత్రి వేళల్లో ఆసుపత్రి చుట్టూ సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి ఫ్లాష్ మాబ్ నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన కొనసాగిస్తామని జూడా సంఘం నేతలు తెలిపారు. సమ్మెలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యు.ఈశ్వర్ శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ డాక్టర్ ఎ.వి.కృష్ణచౌదరి, డాక్టర్ కె.ప్రసన్న ఆదిలక్ష్మి, డాక్టర్ షేక్ సోహిల్ ఆలి, జనరల్ సెక్రటరీలు డాక్టర్ జగదీష్ గాదె, డాక్టర్ పి.ఎస్.వి.కల్యాణి, డాక్టర్ విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు డాక్టర్ జేత్ర మర్రిపాటి, డాక్టర్ అనురాగ్, జాయింట్ సెక్రటరీలు డాక్టర్ బి.వంశీకష్ణ, డాక్టర్ బి.స్నేహసాహిత్య, డాక్టర్ జి.రాధిక, డాక్టర్ కునపవర్ కార్తీక్, డాక్టర్ నిషిరాగ్బికుంతె, డాక్టర్ పి.సందీప్‌కుమార్, ఎగ్జిక్యూటీవ్ సభ్యులు డాక్టర్ ఎన్.సాయిప్రదీప్, డాక్టర్ ఉదయ్‌సాగర్, డాక్టర్ సాయిప్రదీప్, డాక్టర్ తరుణ్ కుమార్, డాక్టర్ హేమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


