టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసిన స్కూల్ బ్యాగుల నాణ్యత డొల్లగా మారింది. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే బ్యాగులు చిరిగిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత నాసిరకంగా తయారు చేసిన బ్యాగులను పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొందన్న విమర్శలు వస్తున్నాయి. పుస్తకాల బరువు కూడా మోయలేక బ్యాగుల జిప్పులు ఊడిపోవడం, కుట్లు తెగిపోవడం సర్వసాధారణమైంది. పుస్తకాలు రోడ్లపై పడిపోతుండటంతో నిరుపేద తల్లిదండ్రులు సొంత డబ్బు వెచ్చించి వేరే బ్యాగులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుని, ఆచరణలో మాత్రం నాసిరకం వస్తువులు ఇచ్చి పేద విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి నేతలు, తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికారులు స్పందించి నాసిరకం బ్యాగుల సరఫరాపై విచారణ జరిపి, నాణ్యమైన బ్యాగులను విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు


