గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ జూనియర్ వైద్యులు గురువారం నల్ల దుస్తులు ధరించి, రక్తదానం చేసి వినూత్న తరహాలో తమ నిరసనను తెలియజేశారు. వారి సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నినాదాలు చేసి నిరసన తెలిపారు. 125 మంది రక్తదానం చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు 15 మంది పీజీ వైద్యులు స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఐఎంఏ జేడీఎన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కార్తీక్ ఆరే జీజీహెచ్ జూడాలకు మద్దతు తెలియజేశారు. జీజీహెచ్‌కు వచ్చి వారి డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ, సంఘీభావం తెలియజేశారు. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు డాక్టర్ దేవకుమార్, డాక్టర్ స్వరూప్‌కాంత్, డాక్టర్ పాటిబండ్ల అనిల్‌బాబు, డాక్టర్ కవిత, డాక్టర్ రవీంద్రకుమార్, డాక్టర్ శివగోపాల్ జూడాల సమ్మెకు మద్దతు తెలియజేశారు. ప్రభుత్వం జూనియర్ వైద్యుల డిమాండ్‌లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యు. ఈశ్వర్‌శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ డాక్టర్ ఎ.వి. కృష్ణచౌదరి, డాక్టర్ కె. ప్రసన్న ఆదిలక్ష్మి, డాక్టర్ షేక్ సోహిల్ ఆలి, జనరల్ సెక్రటరీలు డాక్టర్ జగదీష్ గాదె, డాక్టర్ పి.ఎస్.వి. కల్యాణి, డాక్టర్ విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు డాక్టర్ జేత్ర మర్రిపాటి, డాక్టర్ అనురాగ్, జాయింట్ సెక్రటరీలు డాక్టర్ బి. వంశీకృష్ణ, డాక్టర్ బి. స్నేహసాహిత్య, డాక్టర్ జి. రాధిక, డాక్టర్ కునపవర్ కార్తీక్, డాక్టర్ నిషిరాగ్ బికుంతె, డాక్టర్ పి. సందీప్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ ఎన్. సాయిప్రదీప్, డాక్టర్ ఉదయ్‌సాగర్, డాక్టర్ సాయిప్రదీప్, డాక్టర్ తరుణ్‌కుమార్, డాక్టర్ హేమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


