గుంటూరు రూరల్: గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామంలో వధూవరులు హెలీకాప్టర్‌లో విహరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రత్తిపాటి సాయికుమార్‌కు వివాహం నిశ్చయమైంది. వివాహం ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో నూతన వధూవరులు, కుటుంబ సభ్యులు హెలీకాప్టర్‌లో గ్రామంపై విహరించాలని భావించారు. డెక్కన్ చాప్టర్స్ సంస్థతో రూ.20 లక్షలకు దీనికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసుల నుంచి అనుమతి పొంది హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వివాహ ఘట్టం పూర్తవ్వగానే నూతన వధూవరులు, కుటుంబ సభ్యులతో కలిసి హెలీకాప్టర్‌లో చక్కర్లు కొట్టారు. వధువును పిడుగురాళ్ల నుంచి లాలుపురానికి తీసుకువచ్చేందుకు కూడా ఒప్పందం చేసుకున్నప్పటికీ, పల్నాడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కారులో తీసుకువచ్చారు.


