సమరయోధులను స్మరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమరయోధులను స్మరించుకోవాలి

Aug 16 2026 5:15 AM | Updated on Aug 16 2026 5:15 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను అర్పించిన వారిని నిత్యం స్మరించుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబటి రాంబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంతో మంది త్యాగధనుల వీరోచిత పోరాటం, ప్రాణాలను అర్పించడం వలనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గత 80 ఏళ్ల కాలంలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ధి చెందుతున్న తీరు గొప్ప విషయమని అన్నారు. ప్రజలందరూ సమానులేననే భావన స్వాతంత్య్రం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు. విభిన్న కులాలు, మతాలు, జాతులు ఉన్నా ప్రజలందరూ ఒక్కటే అని దేశం చాటుతోందన్నారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ కలిసి జరుపుకొనే పెద్ద పండుగ స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. ప్రతిఒక్కరూ హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్‌, జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్‌రెడ్డి, అనుబంధ విభాగాల నాయకులు చింతపల్లి వెంకటరమణ, పఠాన్‌ సైదా ఖాన్‌, కొత్తా చిన్నపరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, అత్తోట జోసఫ్‌, జగన్‌ కోటి, ఓలేటి అరవింద్‌, అంకాల రాజు, జి.ప్రభు, రఘుమహంతి వరలక్ష్మీదేవి, సూదా తులసి కుమారి, మాజీ కార్పొరేటర్లు షేక్‌ రోషన్‌, పడాల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement