● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ● ఘనంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు
గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక బాధ్యత కలిగిన పారిశ్రామికవేత్తగా అయోధ్య రామిరెడ్డి నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు, రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబుతో కలసి భారీ కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించిన అయోధ్య రామిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్తగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. గుంటూరుజిల్లాలో సామాన్య కుటుంబంలో పుట్టి, కష్టాన్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సన్నిహితునిగా, పార్టీలో సీనియర్ నేతగా అయోధ్య రామిరెడ్డి క్రియాశీలకంగా పని చేస్తున్నారని అన్నారు. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడిగా, పారిశ్రామికవేత్తగా అన్ని రంగాల్లోనూ చిరునవ్వుతో ముందుకు వెళుతున్న అయోధ్య రామిరెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్‌రెడ్డి, పెదకాకాని జెడ్పీటీసీ గోళ్ల జ్యోతి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తాడిబోయిన వేణుగోపాల్, సిరిబోయిన అవినాష్, చింతపల్లి వెంకటరమణ, పఠాన్ సైదాఖాన్, ఓలేటి అరవింద్, పి. అరుణ్‌కుమార్, శ్యామల రవి కిషోర్ రెడ్డి, సింగు నర్సింహారావు, కాకుమాను సదా శివ రెడ్డి, ఉయ్యూరు సతీష్ రెడ్డి, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, బాజీ, సురేంద్ర, ఖాజావలీ, కుమార స్వామి, మట్ట శ్రీను, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌లో సవరణలు చేయకుంటే ఉద్యమ కార్యాచరణకు దిగుతామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం. కళాధర్ పేర్కొన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రద్దు, నిబంధనలు సవరించాలని కోరుతూ బుధవారం డీఆర్వో ఖాజావలీకి యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షా పేపర్లస్థాయి గ్రూప్–1ను మించిపోయే విధంగా ప్రశ్నలు ఇవ్వడం, ఔట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో పడ్డారన్నారు. ఇప్పటికై నా స్పందించి స్పెషల్ టెట్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శులు సిహెచ్ ఆదినారాయణ, ఎం.గోవిందు, టి.ఆంజనేయులు, బి. ప్రసాదు, ఎం.కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


