జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: పథకాలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సానుకూల స్పందన పొందే విధంగా ఎప్పుడూ పనిచేయాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. శాఖాపరమైన సూచీలకు అనుగుణంగా కచ్చితమైన, నాణ్యమైన గణాంకాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని రేషన్ కార్డుదారుల సౌలభ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలోనూ, 32 రైస్ మిల్లుల ప్రాంగణాలలోనూ తక్కువ ధర బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీపీటీ ముడి బియ్యం కిలో రూ.58, స్టీమ్ బియ్యం కిలో రూ.62 వరకు ఉందన్నారు. ఈ ప్రత్యేక కేంద్రాల ద్వారా బీపీటీ ముడి బియ్యం కిలో రూ.50 చొప్పున, స్టీమ్ స్టీమ్ బియ్యం కిలో రూ.52 చొప్పున అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బియ్యం కొనుగోలుదారులు కార్డుకు 5 కిలోలుగానీ, 10 కిలోలుగానీ ప్రకటించిన ధరకు పొందవచ్చన్నారు.


