గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026 జిల్లాలోని మూడు సీహెచ్‌సీల్లో ఖాళీగా గైనకాలజిస్ట్‌ పోస్టులు పులిచింతల సమాచారం సాగర్‌ నీటిమట్టం గ్రామదేవతలకు ఆషాఢ సారె భర్తీకి చర్యలు

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
జిల్లాలోని మూడు సీహెచ్‌సీల్లో ఖాళీగా గైనకాలజిస్ట్‌ పోస్టులు
మాతాశిశు రక్షణ మాటలకే పరిమితమైంది. ఉత్తుత్తి ప్రకటనలతో చంద్రబాబు బండారం బయటపడుతోంది. నియోజకవర్గంలో ఫస్ట్‌ రెఫరల్‌ సెంటర్లుగా చెప్పుకొనే సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీలు) నెలల తరబడి ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్‌ పోస్టులను భర్తీ చేయకుండా వైద్య ఆరోగ్యశాఖ చోద్యం చూస్తుండడం పేద గర్భిణులకు శాపంగా మారింది. ఇటీవల తాత్కాలిక నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ గైనకాలజిస్టులు ముందుకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందడం లేదు.

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.1200 టీఎంసీలు. విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.20 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

కొల్లూరు: కొల్లూరులో గ్రామ దేవతలకు మహిళలు ఆదివారం ఆషాఢ సారె సమర్పించారు. పొంగళ్లు, సారెలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.

జిల్లాలోని మూడు సీహెచ్‌సీల్లో గైనకాలజిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇతర ఆస్పత్రుల నుంచి వారంలో రెండు రోజులు గైనకాలజిస్టులను డిప్యూటేషన్‌పై పంపిస్తున్నాం. ఇటీవల తాత్కాలికంగా ఇద్దరు గైనకాలజిస్టులను నియమించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. ఆగస్టులో పోస్టులను భర్తీ చేసి సమస్యను పరిష్కరిస్తాం.

– డాక్టర్‌ బీవీ రంగారావు,

డీసీహెచ్‌ఎస్‌, గుంటూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement