జిల్లాలో 2.37 లక్షల ఓట్లు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 2.37 లక్షల ఓట్లు తొలగింపు

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

నెహ్రూనగర్‌: సర్‌లో ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 40 రోజులపాటు సాగిన ఈ ప్రక్రియలో 2,37,513 ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కలిపి 18,02,074 ఓట్లు ఉన్నాయి. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్‌ ప్రక్రియను చేపట్టింది. 2002 జాబితా ప్రకారం ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్‌కు నిర్ణయించింది. ఈ మేరకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) ఇంటింటికి వచ్చి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేశారు. ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా? లేదా? అనేది సర్వే చేపట్టాలని సూచించిన గడువు జూలై 24తో ముగిసింది. తొలి దశ ప్రక్రియ ముగియడంతో ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. దీనిపై అభ్యంతరాలు, క్లయిమ్‌లు అందజేసేందుకు వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్‌ 3న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

‘పశ్చిమ’లో భారీగా ..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓట్లు ఉండగా వీటిని బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు పరిశీలించారు. డిజిటలైజేషన్‌ అయిన ఓట్లు 2,19,236 కాగా... మ్యాపింగ్‌ కానివి 3,176. అబ్సెంట్‌, పర్మినెంట్‌ షిఫ్టింగ్‌, డెత్‌లు కలిపి 59,319 ఓట్లు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా దొంగ ఓట్లు చేరాయని పలు రాజకీయ పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఓట్లు ఉన్నప్పటికీ మనుషులు లేని పరిస్థితి అధికారులు గుర్తించారు. తరువాత తూర్పు నియోజకవర్గంలో 2,52,062 ఓట్లు ఉండగా డిజిటలైజేషన్‌ పూర్తయినవి 2,03,094 ఓట్లు ఉన్నాయి. వీటిలో మ్యాపింగ్‌ కానివి 2,093, ఏఎస్‌డీ కింద పోయిన ఓట్లు 48,968 ఉన్నాయి. తరువాత ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2,70,185 ఓట్లు ఉండగా డిజిటలైజేషన్‌ అయినవి 2,35,748గా తేల్చారు. మ్యాపింగ్‌ కానివి 1,034, ఏఎస్‌డీ కింద పోయినవి మొత్తం 34,437 ఓట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు.

మ్యాపింగ్‌ కాని ఓట్లు 16,558

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement