అన్నదాతల కన్నీటి ‘వెద’ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల కన్నీటి ‘వెద’

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

అన్నదాతల కన్నీటి ‘వెద’ ఖరీఫ్‌ ఆరంభంలోనే తప్పని సాగునీటి కష్టాలు తెనాలి టౌన్‌: వర్షాభావ పరిస్థితుల కారణంగా జలాశయాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం వ్యవసాయానికి నీరు విడుదల చేసే పరిస్థితి లేదని చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. వెద పద్ధతిలో వరి సాగు చేపట్టిన రైతాంగానికి తీవ్ర నిరాశ మిగిలింది. చేసేది లేక డీజిల్‌ ఇంజిన్‌లతో మోటార్ల ద్వారా పొలాల్లోని ట్యూబుల నుంచి వరిచేలకు నీళ్లు పెడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు బిక్కచచ్చిపోతున్నారు. పంట కాలువలకు నీళ్లు ఎప్పుడిస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5.72 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 20 ప్రధాన పంట కాలువలు, వీటి కింద 50 బ్రాంచ్‌ కెనాల్స్‌ ద్వారా రైతులకు ఏటా జల వనరుల శాఖ సాగునీరు విడుదల చేస్తుంది. అయితే ఇప్పటివరకు ప్రధాన పంట కాలువల మరమ్మతులు పూర్తికాలేదు. తాత్కాలిక మరమ్మతులతో పనులు పూర్తి చేసి బిల్లులు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.13.64 కోట్లను మంజూరు చేసింది. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 20 సెక్షన్లు ఉండగా, 284 పనులు జరుగుతున్నట్లు అధికారులు లెక్క చెబుతున్నారు. అయితే ఏ కాల్వ చూసినా అసంపూర్తిగా తొలగించిన గురపు డెక్క, తూటి కాడ, చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలు కనిపిస్తున్నాయి. కరువు, చంద్రబాబు కవల పిల్లలని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు అంటుంటారు. ఆ మాటలు నిజమన్నట్టుగానే పరిస్థితి ఉంది. విజయవాడ సీతానగరం వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా కృష్ణా పశ్చిమ డెల్టాకు 525 క్యూసెక్కుల సాగునీటిని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. క్రమక్రమంగా నీటి విడుదల పెంచుతామని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో అధికంగా 80 శాతం మేర కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటారు. వీరంతా ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తుండగా, గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలు సంభవించి తుఫాన్ల దాటికి పంటలు సరిగా పండక అన్నదాతలు దెబ్బతిన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించినా రాష్ట్రంలో అది అమలుకు నోచుకోలేదు. మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కూటమి నేతలు సిఫార్సు చేసిన వారికే మద్దతు ధర కల్పించారు. ముఖ్యంగా రబీ సీజన్‌లో జొన్న, మొక్కజొన్నకు సంబంధించి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేయడంతో డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వరి పంటకు సంబంధించి సరైన దిగుబడి రాక, రబీ పంటలైన జొన్న, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం అప్పుల పాలయ్యారు.

దిక్కుతోచని స్థితిలో

కౌలు రైతులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వడంతో పాటు, రైతు భరోసా, బ్యాంకు లోన్లు, ఇతర రుణ సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా ఎరువుల పంపిణీలో పారదర్శకంగా వ్యవహరించారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ తుంగలో తొక్కి కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వకపోగా, అన్నదాత సుఖీభవను వర్తింపజేయడం లేదు.

అదనంగా ఎరువుల కష్టాలు

ప్రభుత్వం ఈ ఏడాది నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ రైతులకు ఎరువుల కష్టాలను తెచ్చిపెట్టింది. ఓ వైపు సాగునీరు లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ప్రభుత్వం యాప్‌ల పేరుతో రైతన్నను ఇబ్బంది పెడుతోంది. ఎకరాకు యూరియా, డీఏపీ ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేస్తోంది. ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో రైతాంగం అధికంగా ఎరువుల వినియోగం చేస్తుంటారు. కనీసం ఎకరాకు రెండు కట్టలు అన్నా ఇవ్వకుండా నిబంధనల పేరుతో రైతన్నను ఇబ్బంది పెట్టడం మంచి విధానం కాదని పలువురు ఆరోపిస్తున్నారు.

డీజిల్‌ ఇంజిన్లతో వెద పెట్టిన పొలాలుతడుపుతున్న రైతులు

జూలై సగం గడిచినా కాలువలకు విడుదల కాని నీరు

చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలకు ఆవేదన

ఖరీఫ్‌ ఆరంభంలోనే తప్పని సాగునీటి కష్టాలు
కృష్ణా పశ్చిమ డెల్టాలో వెద సాగు చేస్తున్న రైతన్నలకు ఈ ఏడాది నీటి సమస్యలు పెరిగాయి. ఎటు చూసినా పంట కాలువలు ఎండిపోయి చుక్క నీరు కనబడక ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. జూన్‌ నుంచి ఖరీఫ్‌ ప్రారంభంతో అక్కడక్కడ బోర్లు, డీజిల్‌ ఇంజిన్ల సహాయంతో వెద సాగు చేపట్టారు. జూన్‌ నెలలోనే సాగునీరు విడుదల అవుతుందన్న ఆశతో సాగుకు సమాయత్తమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది.

ఆదిలోనే నీటి సమస్యలు

రూ.వేలల్లో కౌలు చెల్లింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement