విద్యార్థులను మోసగిస్తున్న మంత్రి లోకేష్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను మోసగిస్తున్న మంత్రి లోకేష్‌

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): విద్యా రంగ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ మోసగిస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ ఆరోపించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్‌ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నికల్‌, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. గుంటూరు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్‌లు మాట్లాడుతూ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. నిధులు కేటాయించక విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు డిపార్ట్‌మెంట్‌లను మూసి వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష , కార్యదర్శులు డేవిడ్‌, అమర్నాథ్‌, గుంటూరు నగర నాయకులు అజయ్‌, వెంకటేష్‌, సతీష్‌, బాషా, రాజేంద్ర, తిమోతి, తెనాలి నియోజకవర్గ నాయకులు మణి, కోట్లు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

బందెల నాసర్‌జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement