లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీన ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర‘ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని శుక్రవారం తాడికొండ నియోజక వర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పేరేచర్ల జంక్షన్ వద్ద సాయిబాబా మందిరం ఎదుట ఉన్న సాయి కృష్ణ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.


