న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
పేరుకే పోలీసు...
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 31.4607 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 3 వేల క్యూసెక్కులు వదలుతున్నారు.
తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధులున్నారు. ఒకరు శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరొకరు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలోనే ఉన్నారు. అయినా ఇక్కడ పోలీసులదే ఇష్టారాజ్యమైంది. నెలవారీ మామూళ్ల వసూలు చేయడంతోపాటు ప్రతి పనికీ ఓ రేటు కూడా పెట్టారు. విలాసాలకు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మహిళలతో మరికొందరు వివాహేతర సంబంధాలు నడుపుతున్నారు. ఆ రాసలీలల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


