ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు పిలుపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారంలో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న పికెటింగ్‌ను విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె. నరసింహారావు పిలుపు ఇచ్చారు. గురువారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె. నరసింహారావు అధ్యక్షత వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.బసవ లింగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ 12వ పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతోపాటు మధ్యంతర భృతి ప్రకటించలేదని అన్నారు. నాలుగు విడతల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపు రూ.20 వేల కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పికెటింగ్‌కు జిల్లాలోని ఉపాధ్యాయులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు. రాజశేఖర్, వై.శ్యాంబాబు, గుడిపాటి దాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం గురువారం 513.80 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.


