గుమ్మడి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గుమ్మడి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

Jul 10 2026 5:34 AM | Updated on Jul 10 2026 5:34 AM

● గుమ్మడితో జ్ఞాపకాలను పంచుకున్న అతిథులు ● ‘నంది’లో గుమ్మడి పేరిట ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు అవార్డు ● ముఖ్యఅతిథి శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తన ప్రసంగంలో తనకిష్టమైన నటుల్లో గుమ్మడి ఒకరని చెప్పారు. ఎస్వీ రంగారావు, గుమ్మడి తమ తమ పాత్రల్లో నటించేప్పుడు ఆ పాత్రలే కనిపిస్తాయని సోదాహరణంగా చెప్పారు. ప్రేక్షకుల గుండెను పిండేలా నటించేంత గొప్ప నటుడు గుమ్మడి అన్నారు. ఆయన పేరిట ఉత్తమ నటుడు అవార్డును నంది అవార్డుల్లో ప్రవేశపెట్టేందుకు తన వంతు కృషిచేస్తానని హామీనిచ్చారు. ● ప్రముఖ సినీనటుడు మురళీమోహన్‌ తన ప్రసంగంలో గుమ్మడిని తండ్రిలా భావిస్తానని చెప్పారు. తన తర్వాత క్యారెక్టర్‌ పాత్రల్లో నువ్వే నటించాలని గుమ్మడి తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ● మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలిలో జన్మించిన ఎందరో వివిధ రంగాల్లో శిఖరాలను అధిరోహించారని, అందులో గుమ్మడి ఒకరని చెప్పారు. ● ప్రముఖ సినీనటి ప్రభారమేష్‌ మాట్లాడుతూ, తన సినీనట ప్రస్థానంలో గుమ్మడి పాత్రను వివరించారు. ● సినీ పాత్రికేయుడు, పరిశోధకుడు డాక్టర్‌ రెంటాల జయదేవ తన ప్రసంగంలో ఆరు దశాబ్దాల్లో 507 సినిమాల్లో నటించిన గుమ్మడి, సాహిత్యం చదవనిరోజు, ఇంగ్లిష్‌ సినిమా చూడని రోజు లేదన్నారు. అందుకే ఆయన పరిపూర్ణ నటుడు అయ్యారని చెప్పారు. 20 ఏళ్లలో వయసులో 60 ఏళ్ల పాత్రలో నటించి మెప్పించిన ఏకై క నటుడుగానూ చెప్పారు.

తెనాలి: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాల ప్రారంభం సంరంభం స్వస్థలమైన తెనాలిలో గురువారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో సాయంత్రం కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఉత్సవాలు జరిగాయి. తొలుత గుమ్మడి చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. సభకు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. గుమ్మడి బాల్యం నుంచి అయిదారు దశాబ్దాల ఆయన సినీప్రస్థానంలో మైలురాళ్లను, నటనలో ఆయన పరిపూర్ణతను, క్యారెక్టర్‌ పాత్రకు హద్దులు నిర్ణయించిన గుమ్మడి ప్రతిభను వక్తలు స్మరించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement