దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

నేడు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు కౌన్సెలింగ్‌

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్‌ ఆచార్య ఆర్‌ శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య జి సింహాచలం మంగళవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఏ సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, ఎకనామిక్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సైకాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్‌న్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్‌న్స్‌ మొదటి, రెండవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వైబ్సెట్‌ నుండి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌, పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్‌ జైనలుద్దీన్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు కోదండపాణి, వై వెంకటప్పారెడ్డి, సూపరింటెండెంట్‌ జవ్వాజి శ్రీనివాస్‌, ఉద్యోగులు, వలి, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో మార్చినెలలో ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్‌లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని ఆర్డీ డాక్టర్‌ జి.శోభారాణి మంగళవారం తెలిపారు. అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు రివైజ్‌ చేసి, ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల జాబితా రూపొందించామన్నారు. కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు ప్రొవిజనల్లీ సెలెక్ట్‌ అయిన వారు ఈనెల 10 తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌ కోసం హాజరు కావాలన్నారు. ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌, మార్కుల మెమో, ప్రొవిజనల్లీ సర్టిఫికెట్‌ ఆఫ్‌ క్వాలిఫికేషన్స్‌ ఎగ్జామినేషన్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఏపీ ఎన్‌ఎంసీ సర్టిఫికెట్‌, స్టడీ సర్టిఫికెట్స్‌, అపాయింట్‌మెంట్‌ఆర్డర్‌ కాపీ, సర్వీస్‌ సర్టిఫికెట్స్‌, లేటెస్ట్‌ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌, లేటెస్ట్‌ ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌, అంగవైకల్యం ఉన్న వారు సంబంధిత సర్టిఫికెట్లు, కరోనా సమయంలో పనిచేసినందుకు శాలరీ పొందిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ తీసుకుని రావాలన్నారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement