పెను భారంగా మారిన ధరలు | - | Sakshi
Sakshi News home page

పెను భారంగా మారిన ధరలు

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పాలనలో వైఫల్యాలు సీపీఐ జాతీయ కార్యదర్శి సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు

లక్ష్మీపురం: ప్రధాని బాధ్యతారాహిత్యం వల్ల పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అసాధారణ రీతిలో పెరిగి సామాన్యులకు భారంగా మారాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆరోపించారు. పెంచిన వీటి ధరలు తగ్గించాలని స్థానిక హిమనీ సెంటర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు రాయితీలు ఇచ్చి ప్రజలు వినియోగించే వంట గ్యాస్‌, ఇంధన ధరలను ప్రభుత్వం పెంచడం దుర్మార్గమన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్పుకునే ఎన్డీఏ పాలనలో రూపాయి విలువ పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ సంక్షోభం వచ్చిన నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచామని ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేజీ బేసిన్‌లో రాష్ట్రానికి సగం ఉత్పత్తులు ఇవ్వాలని ప్రణాళిక సంఘం చెప్పినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్‌, సీపీఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కమిటీ సభ్యుడు నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, సురేష్‌ బాబు, గుండెబోయిన లక్ష్మి, బి.వెంకటేశ్వర రెడ్డి, చల్ల మరిదాసు, జంగాల చైతన్య, రత్నం, కోట్ల మరిదాసు, రాయల వెంకటేశ్వర్లు, ఆకిటి రామచంద్రుడు, పున్నయ్య, షేక్‌ వలి, మిరియాల కోటేశ్వరరావు, అప్పమ్మ, రాగం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement