చంద్రబాబూ... దేవుడితో రాజకీయాలా ? | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ... దేవుడితో రాజకీయాలా ?

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

దళిత వాడల్లో శ్రీవారి ఆలయాలకు కూటమి గ్రహణం బ్రాహ్మణులకు సైతం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆలయాల జోలికొస్తే పుట్టగతులుండవ్‌ మీడియా సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బ్రాహ్మణ విభాగ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కాలనీల్లో వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను నిర్మించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన చర్యలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బ్రాహ్మణ విభాగ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌ అన్నారు. సోమవారం గుంటూరులోని బృందావన్‌గార్డెన్స్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ ధర్మంపై అమితమైన భక్తి, శ్రద్ధలతో సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 216 ఆలయాలను పునరుద్ధరించి, పూర్వ వైభవం కల్పించారని చెప్పారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 1,342 శ్రీవారి దేవాలయాలను నిర్మించేందుకు గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిలిపివేసిందన్నారు. వీటిలో తిరుపతి జిల్లాలోనే 135 ఆలయాలు ఉన్నాయని తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆలయాలకు సంబంధించి యూసీలు లేవనే సాకుతో రూ.147 కోట్లు విడుదల చేయకుండా అడ్డుకుంటోందని, సంబంధిత యూటిలైజేషన్‌ సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దేవదాయ శాఖ సిద్ధంగా ఉన్నా సీఎం చంద్రబాబు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామన్న పవన్‌ కల్యాణ్‌ మౌనంగా ఉండటం తగదన్నారు. దేవుడితో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవని, ఆలయాల జోలికి రావొ ద్దని హెచ్చరించారు. రాజధాని నిర్మాణానికి భూ ములిచ్చిన రైతులకు దేవదాయ శాఖ భూము లను చదునుచేసి ప్లాట్లుగా ఇచ్చేలా టీడీపీ సర్కారు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బ్రాహ్మణ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు వరుసగా రూ.22 కోట్లు, రూ.23 కోట్లు కేటాయించారని తెలిపారు. మాజీ కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణమాచారి మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌)లో బ్రాహ్మణులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement