ఎస్పీకి నివేదించిన బాధితులు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : చిట్టీల పేర్లతో మోసగించారంటూ పలువురు బాధితులు వాపోయారు. సోమవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అర్జీలు స్వీకరించారు.ఆయా సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదిదారుల సమస్యలపై వెంటనే విచారణ చేపట్టాలని అన్నారు. తద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్‌రావు (సీసీఎస్)లు అర్జీలు స్వీకరించారు.


