న్యూస్‌రీల్
తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు
ఉన్నవారిపైనే మొత్తం పని భారం
పులిచింతల సమాచారం
ఆలయ నిర్మాణానికి విరాళం
సాగర్ నీటిమట్టం
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
అంతా మమ.. శుభ్రత భ్రమ!
● స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల
కోసం అధికారుల ప్రయత్నాలు
● ఆప్కాస్ కార్మికులపైనే
మొత్తం పని ఒత్తిడి
● 293 మందికిపైగా పర్మినెంట్ వర్కర్లకు
మస్టర్ వేసి ఇళ్లకు పంపుతున్న వైనం
● ఇందుకుగాను ప్రతినెలా
కార్మికుల నుంచి డబ్బులు వసూలు
● మరికొంతమంది అధికారుల
ఇళ్లల్లో పనులకు పరిమితం
● ఇంకొంతమందికి నగరపాలక సంస్థ
కార్యాలయంలో డిప్యూటేషన్
● అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ సక్రమంగా
పనులు చేయించలేని పరిస్థితి
నెహ్రూనగర్ : గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు రెగ్యులర్, ఇద్దరు ఇన్‌చార్జి పారిశుద్ధ్య సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులు 293 మంది ఉన్నారు. వీరితోపాటుగా ఆప్కాస్ వర్కర్లు 1897 మంది, అదనపు వర్కర్లు 420 మంది విధులు చేపడుతున్నారు. ఇందులో పనిచేసే పర్మినెంట్ వర్కర్లను వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చు. వీరికి మస్టర్లు వేసి ఇంటికి పంపించాలని శానిటరీ సూపర్‌వైజర్లే సంబంధిత ఇన్‌స్పెక్టర్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనికోసం కార్మికుల నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నగర పరిధిలో 1,897 మంది ఆప్కాస్ వర్కర్లు ఉంటే వారిలో కూడా రెగ్యులర్‌గా విధులు నిర్వహించేది 1,500 మందే అని సమాచారం. మిగతా వారంతా డెప్యూటేషన్‌పై నగరపాలక సంస్థ కార్యాలయంలో, పాఠశాలల్లో, రిజర్వాయర్లలో, పలు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పదుల సంఖ్యలో ఉన్నారు. ఒక్కో అధికారి వద్ద వీరు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ఇళ్లల్లో, ఇతర అధికారుల నివాసాల్లో పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో నగరంలో నిత్యం 3 లక్షలకుపైగా ఇళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే 470 మెట్రిక్ టన్నుల చెత్తను కేవలం కొంత మంది ఆప్కాస్ వర్కర్లే తరలించాలంటే తలకు మించిన భారంలా మారుతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతి డివిజన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. అందరూ సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూస్తేనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకుతోపాటు నగరవాసులకు మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.
పర్మినెంట్ పారిశుద్ధ్య
కార్మికుల సంఖ్య
అప్కాస్ వర్కర్లు
అదనపు కార్మికులు
రోజుకు ఉత్పత్తి అయ్యే చెత్త
మొత్తం కార్మికుల సంఖ్య
మాట్లాడుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు
ఎన్.రవీంద్రరెడ్డికి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తున్న దృశ్యం
7
ఆలయ చైర్మన్ తమ ఆచార వ్యవహారాల్లో కలుగజేసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. కంకణధారణ కార్యక్రమాల్లో మా నాన్నమ్మ, అమ్మ పాల్గొన్నారు. ఇప్పుడు మా అక్క పాల్గొంటుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంకణధారణలను ఇంటిలో తయారు చేసి ఆదివారం ముందు రోజు పూజలో ఉంచి అభిషేకాలు నిర్వహించి భక్తులకు కడతాం. ఇప్పుడు అలాంటి పూజాదికాలు లేకుండా కంకణాలను అమ్మవారి వద్ద ఉంచి భక్తులకు విక్రయించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది వ్యాపారం అవుతుంది. మేం చేయలేమని చెప్పడంతో అధికారం ఉందని పేర్కొన్నారు. మమ్మల్ని బయటకు వెళ్లండని బెదిరిస్తున్నారు.
– కె.కార్తికేయ, ఆలయ అర్చకుడు
ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఈ సంస్కృతి మరింత పెచ్చుమీరుతోందనే చెప్పుకోవచ్చు. దీంతో నగరంలో చెత్త తరలించే భారం అంతా ఆప్కాస్ వర్కర్లపైనే పడుతోంది. అధికారులు చెప్పిన ప్రతి పనిని వారే చేయాల్సి వస్తోంది. అదనపు వర్కర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఏదైనా డివిజన్‌లో ఆప్కాస్ వర్కర్లు సెలవు పెడితే సదరు డివిజన్‌కు అదనపు వర్కర్లును పంపించాలంటే శానిటరీ ఇన్‌స్పెక్టర్లను సంబంధిత సూపర్‌వైజర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు
వదలుతున్నారు.
నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం నగరపాలక సంస్థ పాట్లు పడుతుంటే మరో పక్క పారిశుద్ధ్య సూపర్‌వైజర్లు కొంత మంది తమ జేబులు నింపుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పర్మినెంట్ వర్కర్లు ఉన్నప్పటికీ వారికి మస్టర్ వేసి ఇంటికి పంపుతున్నారు. ప్రతిఫలంగా వారి నుంచి ప్రతి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాఽధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిపోయి జేబులు నింపుకొనేందుకు యత్నించడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


