తెనాలి: స్థానిక డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు.
● తొలిగా కళాహారతి, తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించారు. ఆన్‌లైన్ యాప్‌ల రుణాల ఉచ్చులో చిక్కుకుంటే జీవితాలే నాశనమవుతున్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఉమా రచనకు ‘నాట్యాచార్య’ ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో కుమార్‌బాబు, రచయిత డి.ఉమాశంకర్, దర్శకుడు ఎంవీ రమణ, డి.వినయ్, ఎం.సౌమ్య నటించారు. సంగీతం సింహాద్రిపురం రమణ, బాషా అందించారు.
● అనంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటికను ప్రదర్శించారు. ప్రముఖ నాటక రచయిత స్నిగ్ధ రచనకు టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు.
● చివరిగా ఆరాధన ఆర్ట్స్, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు ఈ నాటికను రచించగా నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు.
● ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం–తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలను నిర్వహించారు. అధ్యక్షులు ఆరాధ్యుల కన్న, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు.


