మహిళా అభ్యర్థులకు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మహిళా అభ్యర్థులకు పరీక్షలు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

మహిళా అభ్యర్థులకు పరీక్షలు

పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీ సెట్‌–2026కు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. పోటీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె మధుమూర్తి ప్రారంభించారు. 680 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 470 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పీపీఎస్‌ పాల్‌కుమార్‌ తెలిపారు. ఏపీ పీ సెట్‌ 2026 పరీక్షల్లో చివరి రోజు సోమవారం హాల్‌ టికెట్‌ నంబరు 30681 నుంచి 31179 వరకూ మొత్తం 499 మంది మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement