మోటరోలా సొల్యూషన్స్‌ ఎండీ, కంట్రీ హెడ్‌గా అనుదీప్‌ | - | Sakshi
Sakshi News home page

మోటరోలా సొల్యూషన్స్‌ ఎండీ, కంట్రీ హెడ్‌గా అనుదీప్‌

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

తెనాలి: మోటరోలా సొల్యూషన్స్‌లో ఆర్నెల్ల క్రితం అతి పిన్నవయసులోనే సీనియర్‌ డైరెక్టర్‌గా ఎదిగి, భారత ప్రభుత్వంచే ‘యూత్‌ ఐకాన్‌–2025’ గౌరవాన్ని స్వీకరించిన ముత్తవరపు అనుదీప్‌ ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, కంట్రీ హెడ్‌, ఇండియాగా పదోన్నతిని పొందారు. తన కార్యస్థానం అమెరికా నుంచి బెంగళూరుకు మారింది. దేశం అంతటా కంపెనీ ఉనికిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తారు. అనుదీప్‌ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. గుంటూరు జిల్లాలోని కేఎల్‌ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ చేశాడు. అమెరికాలోనే డల్లాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో టెలీకమ్యూనికేషన్స్‌లో మరో మాస్టర్స్‌ డిగ్రీని పూర్తిచేశాడు. తదుపరి ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి కాలేజిల్లో ఒకటిగా, అమెరికాలో సెకండ్‌ ర్యాంకులో ఉన్న నార్త్‌వెస్టర్న్‌ కెల్లోగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాడు. ఒక చిన్న స్టార్టప్‌ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్‌ూచ్యన్‌ 500 కంపెనీల్లో ఒకటైన మోటారోలాలో అతి పిన్నవయస్కుడైన సీనియర్‌ డైరెక్టర్‌గా ఎదిగిన అనుదీప్‌, ఇప్పుడు అదే కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, కంట్రీ హెడ్‌, ఇండియాగా పదోన్నతిని పొందటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement