అధిక ధరకు మద్యం విక్రయిస్తే దుకాణాల లైసెన్‌ ్స రద్దు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరకు మద్యం విక్రయిస్తే దుకాణాల లైసెన్‌ ్స రద్దు

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

నెహ్రూనగర్‌ మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్‌లు రద్దు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ హెచ్చరించారు. బెల్ట్‌ షాపుల నిర్వహణను పూర్తిగా నిర్మూలించాలని, గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం గుంటూరు ఎకై ్సజ్‌ కార్యాలయంలో గుంటూరు, పల్నాడు జిల్లాల ఎకై ్సజ్‌ అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ మద్యం షాపులు సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌ రద్దు చేయాలని ఆదేశించారు. నాటు సారా తయారు చేసే వారికి పునరావాసం కల్పించి ఆ వృత్తిని మానిపించాలన్నారు. సమావేశంలో గుంటూరు ఎకై ్సజ్‌ డీసీ డాక్టర్‌ కే. శ్రీనివాసులు, గుంటూరు ఈఎస్‌ అరుణకుమారి, ఏఈఎస్‌ మారయ్య బాబు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎకై ్సజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement