సుమయ మృతదేహానికి రీపోస్టుమార్టం | - | Sakshi
Sakshi News home page

సుమయ మృతదేహానికి రీపోస్టుమార్టం

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

సుమయ మృతదేహానికి రీపోస్టుమార్టం

పట్నంబజారు: బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహానికి శుక్రవారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. పాతగుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండకు చెందిన సుమయ(44)కు 20 సంవత్సరాల కిందట మొహమ్మద్‌ షౌకత్‌ అలితో వివాహం జరిపారు. గతనెల 31న సుమయ హార్పిక్‌ తాగి మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులకు భర్త షౌకత్‌ అలి ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు వచ్చే సరికి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతురాలి సోదరుడు షేక్‌ షఫీ తన సోదరి సుమయ మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్లుగా భార్య, భర్తల మధ్య వివాదం జరుగుతోందని, ఈనేపథ్యంలో తన సోదరిని చంపి పడేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తహసీల్దారు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో శుక్రవారం ఆనందపేటలోని ముస్లిం శ్మశాన వాటికలో సుమయ మృతదేహాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement