విజ్ఞాన్‌ – ఏఆర్‌సీఐ మధ్య అవగాహన ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్‌ – ఏఆర్‌సీఐ మధ్య అవగాహన ఒప్పందం

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

చేబ్రోలు: అధునాతన మెటీరీయల్స్‌ పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో విజ్ఞాన్‌ యూనివర్సిటీ మరియు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరిందని వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ గురువారం తెలిపారు. ఈ ఎంఓయూ పత్రాలను ఏఆర్‌సీఐ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ్‌ రావు, , విజ్ఞాన్‌ యూనివర్సిటీ చాన్సలర్‌ పావులూరి సుబ్బారావు సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు. డాక్టర్‌ పావులూరి సుబ్బారావు అనంత్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సీఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఇరు సంస్థల మధ్య శాసీ్త్రయ సమాచార మార్పిడి, అధ్యాపకులు మరియు విద్యార్థుల ప్రయోగశాల సందర్శనలు, సంయుక్త సదస్సులు, వర్క్‌షాపులు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాములు, గెస్ట్‌ లెక్చర్స్‌, ఫ్యాకల్టీ ఇమ్మర్షన్‌ ప్రోగ్రాంలు నిర్వహించనున్నారు. ఉమ్మడి పరిశోధన పత్రాల ప్రచురణ, పరిశోధన ప్రాజెక్టుల ప్రతిపాదనలు, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, పీహెచ్‌డీ పరిశోధనలకు సహ పర్యవేక్షణ, శాసీ్త్రయ పరికరాల వినియోగం వంటి అంశాల్లో సహకారం అందించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయని, పరిశ్రమలకు అనుసంధానమైన పరిశోధనలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇరు సంస్థల ఉన్నతాధికారులు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement