నగరంపాలెం: మొబైల్‌ఫోన్లు పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు సంప్రదించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గురువారం సుమారు రూ.28 లక్షల విలువ చేసే 140 మొబైల్‌ఫోన్లను బాధితులకు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటిదాకా సుమారు రూ.8.73 కోట్ల విలువ చేసే 4,364 మొబైల్‌ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు, సైబర్ క్రైమ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. ఐటీ కోర్ సీఐ నిషార్‌బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్‌సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు.


