గుంటూరు మెడికల్: ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి ‘ఫిజియోస్ క్రికెట్ లీగ్ – 2026’ టీ20 పోటీలు బుధవారం పెదకాకాని డాక్టర్స్ స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పోటీలను ప్రారంభించిన చంద్ర హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఎన్ శరత్ చంద్ర కుమార్ మాట్లాడుతూ ఫిజియోథెరపీ వైద్యులు వత్తిపరమైన బాధ్యతలు మరింత సమర్థంగా నిర్వహించేందుకు టోర్నీ నిర్వహించటం అభినందనీయం అన్నారు. గెలుపోటములతో పని లేకుండా ప్రతి జట్టు క్రీడా స్ఫూర్తితో మెలగాలని కోరారు. ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి. నాగ సతీష్ కుమార్, మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నుంచి 10 టీములు పాల్గొంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ యార్లగడ్డ రవితేజ, డాక్టర్ ముప్పరాజు వెంకట్రావు, స్పోర్ట్స్ క్లబ్ గౌరవ సలహాదారు పొందూరి శివరాంప్రసాద్, కమిటీ సభ్యులు, టీం లీడర్లు తదితరులు పాల్గొన్నారు.


