జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్
నెహ్రూనగర్: పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుంచి తారకరామ నగర్ వరకు ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్‌ను కాపాడుకోవాలంటే మనం పర్యావరణ అనుకూలమైన సైకిల్ వాడకాన్ని ప్రజా రవాణా వ్యవస్థగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీనా బేగం, హార్ట్ ఫుల్ సెంటర్ రీజినల్ కో ఆర్డినేటర్ రామచంద్రరావు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ జె.సుధీర్, ఎస్‌ఎస్ సోమశేఖర్ పాల్గొన్నారు.


