ముఖ్యమంత్రికి స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రికి స్వాగతం

Jun 4 2026 4:58 AM | Updated on Jun 4 2026 4:58 AM

ముఖ్యమంత్రికి స్వాగతం ఏఎన్‌యూలో ఏపీ పీసెట్‌

గుంటూరు మెడికల్‌: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ స్వాగతం పలికారు. తక్కెళ్లపాడులోని లలితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి చంద్రబాబు బుధవారం వచ్చారు. ముఖ్యమంత్రి రాక కోసం అక్కడ ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ వద్ద చంద్రబాబుకు జిల్లా కలెక్టర్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీసెట్‌–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఏఎన్‌యూలో 8 రోజులపాటు జరిగే ఈ పరీక్షలకు తొలిరోజు బుధవారం 715 మందికిగాను 491 మంది హాజరయ్యారని కన్వీనర్‌ ఆచార్య పీపీఎస్‌ పాల్‌కుమార్‌ తెలిపారు. గురువారం హాల్‌టికెట్‌ నెంబరు 10,716 నుంచి 11,430 వరకున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement