గుంటూరులో ఓపెన్ పికిల్ బాల్ టోర్నీ
● స్థానిక క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో అనూరాధ మాట్లాడుతూ అండర్–14, అండర్–16 మిక్స్‌డ్ , మహిళలు, సింగిల్స్, ఓపెన్ పురుషుల డబుల్స్ ఈవెంట్లలో పోటీలు జరుగుతాయన్నారు.
● ఈ క్రీడ అభివృద్ధి కోసం గుంటూరులో పోటీలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా మహిళలు కూడా పాల్గొనాలన్నారు. మహిళలకు సింగిల్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
● ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఎంట్రీలను డిసెంబర్ 2ల తేదీ లోపు ఆనంద్ కుమార్ వాట్సాప్‌కు 955333 5375 పంపాలన్నారు.
● సింగిల్స్ ఎంట్రీ ఫీ రూ.500 , డబుల్స్‌కి రూ.1000 ఎంట్రీ ఫీజును ఫోన్ పే 8143783999 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.
● పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను అనూరాధతోపాటు ఏపీ పికిల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్. శ్రీధర్, రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ్ కార్యదర్శి వాణికుమారి నందిపాటి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ అశోక.బి, జిల్లా పికిల్ బాల్ సంఘం అధ్యక్షులు టి.హరికిషన్, వీవీవీ హెల్త్ హబ్, అధినేత టి.పద్మావతి ఆవిష్కరించారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ్ ఆధ్వర్యంలో జిల్లా పికిల్ బాల్ సంఘం సహకారంతో డిసెంబర్ 6, 7 తేదీల్లో స్థానిక హనుమాన్‌నగర్ ఒకటో లైన్‌లోని వీవీవీ హెల్త్ హబ్‌లో గుంటూరు ఓపెన్ ప్రైజ్ మనీ పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ గుంటూరు ఆదర్శ్ అధ్యక్షురాలు అనురాధ మన్నే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, నిర్వాహక కార్యదర్శి కె. అరుణ్ కుమార్, కోశాధికారి కె. సుస్మిత, ఉపాధ్యక్షులు డాక్టర్ హనుమంతరావు, టి.మధు స్మిత, శిక్షకులకు ఆనంద్ కుమార్, కె. రవి ఎస్.శివారెడ్డి, సుబ్బారావు పసుపులేటి పాల్గొన్నారు.