ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం
గుంటూరు రూరల్: శివారెడ్డిపాలెం గ్రామంలోమంగళవారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ శాఖను ప్రారంభించారు. కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్‌చేసి బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శివారెడ్డి పాలెంలో 2022లో నూతన బ్రాంచ్‌ను ప్రారంభించటం జరిగిందని, నేడు బ్రాంచ్‌ను నూతన భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. గతం కంటే భిన్నంగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ భారతదేశంలోనే అతిపెద్ద రెండవ గ్రామీణ బ్యాంక్ అని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారి అవసరాలను తీరుస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల చిన్న సన్న కారు రైతులకు, రైతు కూలీలకు, చిరు వ్యాపారులకు బ్యాంక్ సేవలు అందిస్తున్నామన్నారు. క్రాపులోన్, గోల్డ్‌లోన్‌న్, మహిళా సంఘాలకు, ఇతన రంగాలకు అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. టెక్నాలజీ పరంగా అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనేదే మా ప్రధాన కర్తవ్యం, లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్ బి. రామకృష్ణ, రీజనల్ మేనేజర్ చిరుమామిళ్ల శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ నీరజ, కార్పొరేటర్ రమ్య, బిల్డింగ్ దుగ్గినేని మహాలక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.


