చక్ర దిగ్బంధం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్య ట్రాఫిక్. శంకర్ విలాస ఓవర్ బ్రిడ్జి కూల్చివేత అనంతరం ట్రాఫిక్ సమ్యస మరింత తలపోటు తెచ్చి పెడుతోంది. వాహనదారులు ఈస్ట్ నుంచి వెస్ట్‌కు వెళ్లాలన్నా.. వెస్ట్ నుంచి ఈస్ట్ రావాలన్నా.. కంకరగుంట ఫైఓవర్, లేకుంటే అండర్ పాస్, డొంక రోడ్డు మూడు వంతెనల మీదుగానే ప్రయాణం చేయాలి. ఆటోలు, సిటీ బస్సులు ఇష్టానుసారం తిప్పటం, దీనికితోడు అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారింది. గుంటూరులో సుమారు 27 వేలకు పైగా ఆటోలు, నాలుగు లక్షల వరకు బైక్‌లు, సుమారు 50వేలకు పైగానే కార్లు, జీపులు ఉన్నా యని అధికారుల గంణాకాలు వెల్లడిస్తున్నాయి. అరండల్‌పేట నాలుగవ లైను దగ్గర నుంచి మొద లు పెడితే.. సిటిజన్ ఆసుపత్రి వరకు ఎక్కడా సైడ్ వే ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్ (రంగా విగ్రహం ఉన్న ప్రాంతం) నాలుగు రోడ్లు కూడలి అక్కడ కూడా వదలి పెట్టలేదు. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకై నా.. చోటు కల్పిస్తే.. కొద్దిమేరలో అయినా.. వాహనాలు పక్కకు వెళ్లిపోతాయి. ఆఖరికి మంగళబావి సందు వద్ద కూడా సిమెంట్ దిమ్మెలు అడ్డుగా పెట్టేశారు. దీంతో అటు పక్కకు వెళ్లే అవకాశం లే దు. సంజీవయ్య నగర్, కాకాని రోడ్డు, నెహ్రూనగర్ మీదుగా వచ్చే వాహనాలు కూడా అధికం కావడం, ఈ ప్రాంతాల్లో రైల్వే గేటులు ఉండటం వల్ల రైళ్ళు వచ్చే సమయాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. అదే సమయంలో కేవలం ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు మాత్రమే అక్కడ విధుల్లో ఉంటున్నారు. వారు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
ఇదెందుకు మూసేశారు..సారూ..?
గణేష్ మహల్ రోడ్డు నుంచి మార్కెట్, పలు వస్త్ర దుకాణాలకు వెళ్లే రాధాకృష్ణ థియేటర్ సెంటర్ (ఆర్కేటీ) వద్ద దారి మూసివేశారు. నాలుగు రోడ్ల కూడలి కావటం, సిగ్నల్ పాయింట్ ఉండటం వల నే ట్రాఫిక్ కొద్దిమేర ఉపశమనం కలిగించే ప్రాంతం. ఇక్కడ ట్రాఫిక్ ఆపేసి.. కింగ్స్ హోటల్ సెంటర్ వద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆర్కేటీ సెంట ర్ నుంచి కింగ్స్ హోటల్ వైపు రాంగ్ రూట్‌లో వా హనాలు వెళ్లటం, స్టేడియం వైపు నుంచి వచ్చే వా హనాలు అక్కడ నిలిచిపోవటం, మాయాబజారు, చిన్నబజారు డౌన్ ప్రాంతాల నుంచి వాహనాలు అ ధికంగా రావటం వల్ల అక్కడ ట్రాఫిక్‌కు అంతరా యం కలుగుతోంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద పరిస్థితి చెప్పాల్సిన పనేలేదు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమే. కానిస్టేబుళ్లు మైక్‌ల్లో అనౌన్స్‌మెంట్ చేయటంతప్ప, ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితులులేవు.
చక్ర దిగ్బంధం


