బీసీ కులగణన జరపాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా బీసీ కులగణన తప్పనిసరిగా నిర్వహించాలి. రాష్ట్రంలో కనీసం 5, 6 శాతం కూడా లేని వారు రాజ్యాధికారాన్ని అనుభిస్తుంటే బీసీలు మాత్రం పల్లకీ మోసే బోయలుగా మిగిలిపోతున్నారు. స్థానిక సంస్థల్లో, చట్ట సభల్లో రిజిర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన చేపట్టాలి. ఈ ప్రభుత్వం బీసీల సమస్యలను పక్కదోవ పట్టిస్తుంది. పరిష్కార దిశగా చూడడంలేదు.
–బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతికుమార్


