ఉత్సాహంగా అస్మిత అథ్లెటిక్స్
పెదకాకాని: క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరచడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహించవచ్చని మంగళగిరి రూరల్ ఎస్‌ఐ సీహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం అండర్ 14, 16 బాలికలకు అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌ఖాన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ కూడిన జీవితాన్ని ఇస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్‌ఖాన్ మాట్లాడుతూ అథెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జిల్లాలో అథ్లెటిక్స్ లీగ్ నిర్వహించటం ఆనందదాయకమన్నారు. క్రీడల్లో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొనేవిధంగా ప్రభుత్వం ఈ లీగ్‌లు నిర్వహించి బాలికలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలికలు ముందంజలో ఉండాలని కోరారు. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, అంతర్జాతీయ క్రీడాకారుడు కె.కృష్ణమోహన్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం చైర్మన్ జి.శేషయ్య, కోచ్‌లు ఎస్ శివారెడ్డి, వెంకటేశ్వర్లు కె.రవి, కె.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎన్‌యూలో ముగిసిన
ఒక్కరోజు క్రీడా పోటీలు
ఉత్సాహంగా అస్మిత అథ్లెటిక్స్
ఉత్సాహంగా అస్మిత అథ్లెటిక్స్


