అవకాశమున్న ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే..
పూర్తిస్థాయి పెన్షన్ ఇప్పించండి
గుంటూరు వెస్ట్: పీజీఆర్‌ఎస్‌లో అందిన ప్రతి అర్జీ నమోదు కావాల్సిందేనని, అవకాశమున్న ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయని, మరింతగా ప్రజలకు చేరువ కావాలన్నారు. ప్రభుత్వ సేవలు పొందడం ప్రజల హక్కు అన్నారు. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంటుందని తెలిపారు. పరిష్కారానికి అవకాశం లేని అర్జీలు వారికే వివరించి చెప్పాలని, పదేపదే తిప్పుకోవద్దని హితవు పలికారు. కలెక్టర్ ఉదయం 9 గంటలకే పీజీఆర్‌ఎస్ ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్ సిబ్బంది ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో పరిశీలించారు. అప్పటి వరకు అధికారులు ఎవ్వరూ హాజరు కాలేదు. కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులతో కలసి 290 అర్జీలను స్వీకరించారు.
నాకు 90 శాతం అంగవైకల్యం ఉంది. ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన రీ సర్వేలో నాకు 60 శాతం మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. నేను పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నాను. ఏ పని చేసుకోలేకపోతున్నాను. దయచేసి నాకు పూర్తిస్థాయి పెన్షన్ రూ.15 వేలు ఇప్పించాలి.
–పఠాన్ జాన్ సైదా, దావులూరు, కొల్లిపర మండలం,
అవకాశమున్న ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే..


