గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) కేంద్ర కార్యాలయాన్ని ఈనెల 28న గుంటూరు కన్నావారితోట 4వ లైనులో ప్రారంభిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.రమేష్‌కుమార్‌లు తెలిపారు. కేంద్ర కార్యాలయాన్ని కర్నూలు మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ఈఎన్‌టీ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభిస్తారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి సంఘ సభ్యులంతా హాజరు కావాలని రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పి.జె.శ్రీనివాస్ కోరారు.
కత్తిపోట్లకు గురైన మహిళ మృతి
తెనాలిరూరల్: సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలో కత్తి పోట్లకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి రామలింగేశ్వరపేట రైస్ కాలనీలో ఈ నెల 21వ తేదీన కూరగాయల వ్యాపారం చేసే కందుకూరి ఉషపై ఆమెతో సహజీవనం చేస్తున్న విజయ్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఉష గుంటూరు సమగ్ర వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి సోమవారం వచ్చిన సమాచారం మేరకు హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్టు తెనాలి పోలీసులు తెలిపారు.
లింగాపురంలో ఘర్షణ
ఇద్దరికి గాయాలు
మాచర్ల రూరల్: మండలంలో పరస్పర దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన మండలంలోని లింగాపురంలో సోమవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్వర్లు, రాగి నాగేశ్వరరావు మధ్య చిన్న ఘర్షణ ఏర్పడి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని మహిళకు గాయాలు..
వేగంగా వెళ్తున్న కారు ఢీకొని పశువుల కాపరి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కె. రమణమ్మ పొలం నుంచి పశువులను తోలుకొని ఇంటికి వెళ్తుండగా, గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రమణ తల, కాలుకు గాయాలయ్యాయి. మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలించారు. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
28న ప్రభుత్వ వైద్యుల సంఘ కార్యాలయం ప్రారంభం
28న ప్రభుత్వ వైద్యుల సంఘ కార్యాలయం ప్రారంభం


