టెండర్ల వాయిదాల పర్వం
● అమరావతి రాజధాని, విజయవాడ, గుంటూరు నగరాలలో పది పనుల కోసం ఏపీసీఆర్‌డీఏ రూ.793.22 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. పై మొత్తంతో ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉండగా... తక్కిన మూడు టెండర్లు సేవలకు సంబంధించినవి. నిర్మాణ, నిర్వహణ పనులకుగాను టెండరు డాక్యుమెంట్లను జూలై 11 నుంచి ఆగస్టు 8వ తేదీలోగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. నిర్దేశిత బిడ్లకు ఆగస్టు ఒకటి నుంచి 13వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయడానికి గడువు విధించింది.
● గుంటూరు జేకేసీ కాలేజీ మార్గంలోని స్వర్ణభారతి నగర్ వద్ద నుంచి పెద్దపలకలూరు వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేజ్ కింద నిర్మాణానికి రూ.34,87,28,545కు టెండరు పిలిచింది. ఆగస్టు ఏడో తేదీ టెండరు దాఖలుకు గడువిచ్చింది. టెక్నికల్ బిడ్డు తెరవగా ఆరు టెండర్లు దాఖలైనట్లు గుర్తించారు. టెండరు నిబంధనల ప్రకారం 8వ తేదీ ఫైనాన్షియల్ బిడ్‌ను తెరవాలి. ఇప్పటివరకు ఆ పనిచేయలేదు. కారణాలేంటని తాము పలుసార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వడం లేదని టెండరు దారులు ‘సాక్షి’కి తెలిపారు.
● విజయవాడ నగరంలోని బల్లెంవారివీధి జంక్షన్ నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు (హెచ్‌టీ లైన్ రోడ్) బీటీ హాట్ మిక్స్‌తో రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ వంటి పనులకు రూ. 26,51,89,656 మేరకు టెండరు ఆహ్వానించింది. అదేవిధంగా మహానాడు రోడ్డు నుంచి బల్లెంవారివీధి నుంచి పోరంకి, నిడమానూరు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకు రూ. 25,52,45,567 మరో టెండర్‌ను పిలిచింది. బందరు రోడ్డు నుంచి హెచ్‌టీ లైన్ జంక్షన్ వరకు బల్లెంవారి వీధి రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనుల నిమిత్తం 22,96,21,066 టెండరు ఆహ్వానించింది. పై మూడు పనులకు సంబంధించి ఆగస్టు 11వ తేదీ టెక్నికల్ బిడ్ తెరవనున్నట్లు పేర్కొన్నప్పటికీ ఆ మేరకు చేయలేదు. ఏ కారణం లేకుండానే 19వ తేదీ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్పిన అధికారులు అలా చేయకపోగా మరోసారి ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడం పరిశీలనాంశం. మూడు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేయకుండా మూడు పర్యాయాలు ఎందుకు వాయిదా వేశారనేది అంతుబట్టని అంశంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకపోవడం, విజయవాడలోని మూడు పనుల టెండర్లను ఇలా వాయిదాలు వేయడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. బడా గుత్తేదారులకు పనులు అప్పగించాలనే వ్యూహంతో ఉన్నప్పుడు ఏపీ సీఆర్‌డీఏ టెండర్లు పిలవడం ఎందుకని నిలదీస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రూ.793.21 కోట్లతో పది పనులకు టెండరు నోటీసు ఇందులో మూడు సేవలు, ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు రూ.683.33 కోట్లతో రాజధానిలో సమ్మిళిత పనులు రూ.109.88 కోట్లతో విజయవాడ, గుంటూరులో 4 రోడ్ల నిర్మాణాలు గుంటూరు ఐఆర్‌ఆర్ పనికి ఆరు టెండర్లు దాఖలు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్‌కు మీనమేషాలు విజయవాడలో మూడు పనులకు మూడు వాయిదాలు టెండర్లు ఏపీసీఆర్‌డీఏ టెండర్లలో తిరకాసులెన్నెన్నో...
అయినవారి కోసమేనా
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఏపీ సీఆర్‌డీఏ ఆహ్వానించిన టెండర్లను నిర్ణీత సమయంలో తెరవకుండా మీనమేషాలు లెక్కిస్తూ తమకు అనుకూలురైన కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్‌కు బిడ్లు దాఖలైనప్పటికీ సహేతుక కారణాలేవీ లేకుండానే ఫైనాన్షియల్ బిడ్ తెరవకుండా వాయిదా వేస్తుండగా, కొన్ని టెండర్లకు సంబంధించి సాంకేతిక బిడ్‌లను కూడా ఓపెన్ చేయడం లేదని టెండరుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమకు అనుకూలురైన బడా కాంట్రాక్టర్లకు పనుకట్టబెట్టడానికే వాయిదాల వ్యవహారాలను ఏపీసీఆర్‌డీఏ ఉన్నతాధికారుల ద్వారా కూటమిలోని పెద్దలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అన్ని పనులను ఒకటిగా చేసి పెద్దమొత్తంతో టెండరు పిలిచి బడా కంపెనీలకు అప్పజెప్పి భారీస్థాయిలో పర్సంటేజీలు రాబట్టుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే వాయిదాల పర్వమని స్పష్టమవుతోంది.
పది పనులకు టెండర్లు
1/1
టెండర్ల వాయిదాల పర్వం