
సమయపాలన పాటించండి
అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పీజీఆర్‌ఎస్‌లో 256 అర్జీలు స్వీకరణ
గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా అధికారులు సమయపాలన పాటించడంలేదని, నిర్ణీత సమయానికే అందరూ తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కొందరు అధికారులు తమ ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధానం మార్చుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయి తగ్గుతుందని, ఈ విషయాన్ని గుర్తించి మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రజల నుంచి అందిన 256 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్‌ఓ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.