
ప్రేమ, దయ, సేవ అనే మూల్యాలను పాటిస్తూ.. జీవితమంతా పేదలకు, అనాథలకు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అండగా నిలిచారు మదర్ థెరిసా. భారతరత్న, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా జయంతి నేడు. ఈసందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమెకు నివాళులర్పించారు.
ప్రేమతో చేసిన చిన్న పనులు(సేవలు) కూడా ప్రపంచాన్ని మార్చగలవు. ఈ విషయాన్ని మదర్ థెరిసా జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఆమె జన్మదినాన్ని స్మరించుకుంటూ, ఆమె సేవా మార్గాన్ని మనం గౌరవించాలి అని ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన.
Mother Teresa’s life reminds us that even small acts of love can make a big difference. Remembering her on her birth anniversary.#MotherTeresa pic.twitter.com/OqlR4K5y6E
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025